Sunday, September 9, 2007

ఎటువైపీ పయనం.....

ఏం జరుగుతోందిక్కడ? సర్వంసహాసౌర్వభౌములవారి ఇంటికి కూతవేటు దూరంలోనే ఏమిటీ ఘోరం..
నేను, మీరు, మనందరం కొంటున్న ప్రతీ వస్తువూ, సబ్బు-ఉప్పు-పప్పు అన్నింటిమీదా వసూలుచేస్తున్న పైస పైస కూడబెట్టేది కొంతమంది అవినీతిపరుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారికి నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెల్లించడానికేనా!!

జరుగుతున్న ఘోరాలకి కారణ'భూతా'లెవరో కనుగొని వారి వారి ఆదాయంలోంచి సదరు నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) మొత్తాలను వసూలు చేయలేరా? నిజంగా ప్రభుత్వానికి ఆ శక్తి లేనట్లయితే ఇంత యంత్రాంగం, మంత్రాంగం నౌకర్లు చాకర్లు, ఇంత జీతాలు భత్యాల ఖర్చు మాత్రం మనమెందుకు భరించాలి? అసలు అవినీతికి పాల్పడుతున్నదే మేము, ఆ పని మేమెలా చేయగలమంటారేమో....

బాంబులు పేలితే బంగ్లాదేశ్‌లో మా యంత్రాంగం ఉందా అని ప్రశ్నించిన మాగొప్ప పాలకులు, మన సొంత బ్యురోక్రసీ, డెమొక్రసీ, కాంట్రాక్టోక్రసీ కలిసి కూల్చిన పదిహేను పైబడిన ప్రాణాల గూర్చి ఇంకెన్ని వల్లిస్తారో మరి రేప్పొద్దున్న చూడాలి........

5 comments:

చేతన_Chetana said...

నేను విన్న ఒక అభిప్రాయం ప్రకారం, CMగా ఎవరు ఉన్నా ఎవరు ఏమీ చేయలేరూ, ప్రతీ ఒక్కర్నీ వెళ్ళి ప్రశ్నించలేరు.. అంట.. ఎంత strictగా ఉన్నా ఏమి చేయలేము, మన్మోహన్ సింగ్ idealistic అని పేరు, కానీ ఏమి చేయలేకపొతున్నాడు..అని reasoning. నాకస్సలు అర్థం కాలేదు అదేంటో.. Leaders are supposed to be just not only idealistic but also tough and strong.. if you can't be that.. u r just a దద్దమ్మా, అది strict ఉన్నట్టు కాదు, చేతకానితనం అంతే..u r not fit to be a leader కానీ మన CM గారికి అది కూడా లేదు. ఇది మా చేతుల్లో లేదూ, అది మా కంట్రోల్లో లేదూ, ఏదీ మా బాధ్యత కాదూ, నాకు సంబంధం లేదూ, ఇలాంటివి జరుగుతుంటాయి , మనమేమీ చేయలేము.. అంటుంటే .. నువ్వు CMగా ఎందుకు మాకూ? u r just unfit to be a CM. నీకు ఇష్టమైన సొనియా పారాయణ చేసుకో. Common man అయిన నేనూ ఏమీ చేయలేకా.. CM అయిన నువ్వూ ఏమీ చేయలేకపోతే .. నీకు నాకు difference ఏంటీ.. నీకు ఇంక అధికారం ఎందుకు? ఇన్నాళ్ళూ, కుంభకోణాలూ.. కుమ్మక్కులూ, గొడవలూ.. common man direct గా affect కాలేదు.. tangible లెవెల్ లో. ఇప్పుడు జనాల ప్రాణాలే పోతున్నా.. లెక్కలేదు. ఎవరు ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోస్తున్నా దున్నపోతు మీద వర్షం లాగ చలనం లేకుండా కూర్చోవటమే కాకుండా.. పత్రికల వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే.. ఏదో కక్షకట్టి తిడుతున్నట్టు, దానికి అసహనంగా defend చేసుకుంటున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా జనాలకి జవాబుదారితనంతో సమాధానం ఇస్తున్నట్టూ లేదు. ఛీ సిగ్గు లేని బ్రతుకు.. కనీసం నా నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నయనే slightest guilty feeling కూడా ఏమాత్రం ఉండదేమో ఎదవ జన్మ కి.. ఇక్కడ కాంగ్రెస్ వారనే కాదు.. పలానా అధికారి, పలానా కాంట్రాక్టెర్ అనే కాదు.. అందరూ తినేవాళ్ళే, అందరు పెట్టేవాళ్ళే.. కానీ దారుణంగా ఇలా directగా జనాలందరికీ తెలుస్తున్నా, చూస్తున్నా, అడుగుతున్నా..నాకు సంబంధం లేదూ, నా తప్పు కాదూ అని కయ్కయ్మని పత్రికలమీద అరిచేసి.. నన్ను కాదన్నట్టు దులుపేసుకుని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ.. లోకంలో ఎవరూ నన్ను చూడటంలేదనుకుంటే ఎలా.. ఇంత చేసాక next electionsలో ఎలాగో అధికారంలోకీ రారూ.. కానీ అదొక్కటే కాదు కదా solution. . పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా.. జరిగిన నష్టం పూడుకుంటుందా.. ప్రతిపక్షాలు వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు, ఇదే టైంలో ఓట్లు మనవైపు తిప్పేసుకోవాలనే ఏదవ ఆశతో మరీ ఎక్కువ గొడవచేస్తున్నారూ అని కూడా అంటున్నారూ.. అవును నిజమే.. వాళ్ళ ఓటు పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళకి అంత చాన్స్ ఇస్తున్న ఎదవలు ఎవరు.. . ఎదవపనులు చేస్తూ, అలాంటి చాన్స్ కోసమే చూస్తున్న ప్రతిపక్షాలు అనకూడదు అంటే ఎలా? ఇంకో విషయం, ఎక్కడో కామెంట్లలో ఎవరో అంటే గుర్తొచ్చింది.. .రాష్ట్రంలో ఇన్నేసి డ్యాములు కడుతున్నారూ.. ఒక బ్రిడ్జ్ పడిపోతే 10-20 మాత్రమే పోయారు.. అనకూడదు కానీ, అలాంటిది డ్యాంకి ఏమన్నా అయితే, ఎంత జన/ఆస్తి నష్టం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భగవంతుడా ప్లీజ్ నా దేశాన్ని కాపాడు..

psmlakshmi said...

ప్రస్తుత కాలంలో ప్రతిపక్షం ప్రధాన బాధ్యత గద్దె ఎక్కిలవాడిని దించటమే. పాలకుల బాధ్యత దీపంవుండగా ఇల్లు చక్కబెట్టుకోవటమే. ప్రజల బాధ్యత గుడ్డిగా, లేకపోతే డబ్బులనిబట్టి ఓట్లు వెయ్యటం, చదువుకున్న వాళ్ళ బాధ్యత ఓట్లు వెయ్యటానికి బధ్ధకించటం. ఈబాధ్యతల అర్ధాలు మారినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. దానికి మనవంతు కృషి మనం మనిషిగా బతకటమే. పియస్.యమ్.లక్ష్మి

psmlakshmi.blogspot.com

psmlakshmi said...

ప్రస్తుత కాలంలో ప్రతిపక్షం ప్రధాన బాధ్యత గద్దె ఎక్కిలవాడిని దించటమే. పాలకుల బాధ్యత దీపంవుండగా ఇల్లు చక్కబెట్టుకోవటమే. ప్రజల బాధ్యత గుడ్డిగా, లేకపోతే డబ్బులనిబట్టి ఓట్లు వెయ్యటం, చదువుకున్న వాళ్ళ బాధ్యత ఓట్లు వెయ్యటానికి బధ్ధకించటం. ఈబాధ్యతల అర్ధాలు మారినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. దానికి మనవంతు కృషి మనం మనిషిగా బతకటమే. పియస్.యమ్.లక్ష్మి

psmlakshmi.blogspot.com

Unknown said...

కందర్ప కృష్ణ మోహన్ - గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి

- హారం ప్రచారకులు.

manashi12 said...

ప్రస్తుత కాలంలో ప్రతిపక్షం ప్రధాన బాధ్యత గద్దె ఎక్కిలవాడిని దించటమే. పాలకుల బాధ్యత దీపంవుండగా ఇల్లు చక్కబెట్టుకోవటమే. ప్రజల బాధ్యత గుడ్డిగా, లేకపోతే డబ్బులనిబట్టి ఓట్లు వెయ్యటం, చదువుకున్న వాళ్ళ బాధ్యత ఓట్లు వెయ్యటానికి బధ్ధకించటం. ఈబాధ్యతల అర్ధాలు మారినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. దానికి మనవంతు కృషి మనం మనిషిగా బతకటమే. పియస్.యమ్.లక్ష్మి

yourlocalinstaller