Sunday, September 16, 2007

పంజాగుట్ట ఫ్లై ఓవర్ - కొన్ని సత్యాలు.......


చావా కిరణ్, తాడేపల్లి గార్ల సౌజన్యంతో...



చిత్రం-1 :ఇక్కడ వంతెనని మోస్తున్న నాలుగు ఆధారాలూ చుట్టుకొలతలోను ఎత్తులోను ఒకేలాలేకపోవడం గమనించండి.
చిత్రం-2 :ఇక్కడ వంతెనకు ఒకే వొక్క ఆధారం ఉంది. అదీ మధ్యలో కాకుండా ఒకమూలకొచ్చింది.



చిత్రం-3 :అదే స్తంభం-కొంచెం విస్తృత దృశ్యంగా...దాని తరువాతి స్తంభానికి మటుకు రెండు ఆధారాలుండడం గమనించండి.


చిత్రం-4 :ఇదివరకటి చిత్రంలోని ఒంటి ఆధారం వంతెన మలుపు తిరగడం కోసం అనుకుంటే-మఱిఇక్కడి స్తంభానికి రెండు వేరు వేరు ఎత్తులు గల ఆధారాలు ఉండకూడదు.




చిత్రం-5 :వంతెనగా ఏర్పడి కనిపిస్తున్న విభిన్న కాంక్రీటు బ్లాకుల మందం వంతెనపొడవునా ఒకే విధంగా లేదు. ఇక్కడ అటువంటి ఒక పల్చటి బ్లాకుని ఒంటి ఆధారంగల స్తంభం మోస్తోంది.



చిత్రం-6 :ఈ భాగానికి చెందిన వంతెన ఉపరితలాన్ని ఒకే మట్టంలో కట్టాల్సి వుండగా, దానిస్తంభాలు మాత్రం ఒకటి పొట్టిగా ఇంకొకటి పొడవుగా ఉన్నాయి.




చిత్రం-7 :ఇక్కడా మళ్ళీ అటువంటి ఒక ఒంటి ఆధారం సిద్ధం. ఇది వంతెన బరువుని సమానంగాఅన్నివైపులకూ నిభాయించడం సందేహాస్పదం.





చిత్రం-8 :వంతెన మలుపులో మొగ్గిన విధానం తప్పు. ఉండాల్సిన దానికి పూర్తి విరుద్ధం.చిత్రంలోని పసుపుపచ్చ గీతలు ఉండాల్సిన వాలును సూచిస్తున్నాయి.కూలిపోయిన వంతెన భాగానికి ఈ భాగం ఆనుకునే ఉంది.(కూలిపోయిన భాగాన్ని నిర్మించకముందే ఈ ఫోటో తియ్యబడింది. ఇనుప స్తంభాల్నిగమనించండి)



చిత్రం-9 :అదే వంతెన భాగం - మఱింత దగ్గరగా...








చిత్రం-10










చిత్రం-11 :సరిగ్గా రెణ్ణెల్ల క్రితంనాటి పరిస్థితి.









చిత్రం-12











చిత్రం-13











9 comments:

kashyap S said...

సామాన్య ప్రజలకి కూడా ఇంత మంచిగా అర్థమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ దారుణం ఎందుకు కనిపించడం లేదు? నిర్మాణం లోని లోపాలు చాలా చక్కగా చూపించారు. కానీ ఈ టపా చూసిన తరువాత హైదరాబాదు వెళ్ళాలంటే భయంగా ఉంది.

kashyap S said...

చెప్పడం మరిచాను, ఈ చిత్రాలని తొందరగా ఇక్కడి నుంచి తీసివెయ్యండి. మన మంత్రులు ఎవరన్నా చూస్తే మీ మీద యుద్ధం ప్రకటిస్తారు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

లోకమంతా కోడై కూస్తూంటే లేనిది మనం బ్లాగితే అవుతుందా తప్పు ? నా దృష్టిలో నిజాలు నిజాలుగా మాట్లాడకపోవడమే తప్పు. తప్పుల్ని కప్పిపుచ్చడమే చాలా పెద్ద తప్పు. ఈ మాత్రం రాసే స్వేచ్ఛ లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అనుకోవడం శుద్ధదండగ. నా బ్లాగులో ఇంతకంటే ఘాటుగా రాశాను.చూద్దాం, ఎవడేం చెయ్యగలడో ! కృష్ణమోహన్గారూ ! మీరేం చలించకండి !

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

అధారాలతో సహా చక్కగా వివరించారు. ఈ ఆధారాలు ఏవైనా పత్రికకు పంపితే ఉపయోగం ఉంటుందంటారా..?

కందర్ప కృష్ణ మోహన్ - said...

హరీష్ గారికి
నాపట్ల మీరు చూపించిన జాగ్రత్తకు కృతజ్ఞతలు..
తాడేపల్లి గారికి
నాకటువంటి భయాలేమీ లేవండీ.. సత్యానికీ భయానికీ పొత్తు కుదరదులెండి.

రాజారావు గారికి
నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ....నేను చూడలేను బాబోయ్ అని కళ్ళు మూసుకుని భయపడేవాళ్ళని అంగుళం కూడా కదపలేము, అయినా స్పందించే హృదయమున్నవాళ్ళకి ఎప్పడైనా కలుక్కుమని కాస్త లేస్తారేమోనని ఒక చిన్ని ఆశ...

Anonymous said...

మీరేం కంగారు పడకండి. గుంపు లో నుండి కాపీ చేసిన ఈ PPT ఈ మధ్య ఈ కేసులన్నీ దర్యాప్తు చేస్తున్న ఒక ఆఫీసర్ కి చేరి వేయబడ్డాయి నాకు తెలిసిన ఒక స్నేహితుని ద్వారా. వాళ్ళు చూసి చెయ్యగలిగేదేమీ లేదు రిపొర్టులకు అతికించడం తప్ప.

-- విహారి

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

మీ ఫొటొల ద్వారా ఎలాంటి వారికయిన అర్థమవ్తుంది తప్పు ఎక్కడ ఉంది అని

Bolloju Baba said...

ఈ ఫోటోలన్నీ ఎలా సంపాదించగలిగారు?

బొల్లోజు బాబా

Unknown said...

It is a fact that Congress government has not taken the last accident that happened in Punjagutta flyover as serious as it affected the lives of victims.

What a pity on the commuters from down of this flyovers... god save them