Sunday, September 16, 2007

పంజాగుట్ట ఫ్లై ఓవర్ - కొన్ని సత్యాలు.......


చావా కిరణ్, తాడేపల్లి గార్ల సౌజన్యంతో...చిత్రం-1 :ఇక్కడ వంతెనని మోస్తున్న నాలుగు ఆధారాలూ చుట్టుకొలతలోను ఎత్తులోను ఒకేలాలేకపోవడం గమనించండి.
చిత్రం-2 :ఇక్కడ వంతెనకు ఒకే వొక్క ఆధారం ఉంది. అదీ మధ్యలో కాకుండా ఒకమూలకొచ్చింది.చిత్రం-3 :అదే స్తంభం-కొంచెం విస్తృత దృశ్యంగా...దాని తరువాతి స్తంభానికి మటుకు రెండు ఆధారాలుండడం గమనించండి.


చిత్రం-4 :ఇదివరకటి చిత్రంలోని ఒంటి ఆధారం వంతెన మలుపు తిరగడం కోసం అనుకుంటే-మఱిఇక్కడి స్తంభానికి రెండు వేరు వేరు ఎత్తులు గల ఆధారాలు ఉండకూడదు.
చిత్రం-5 :వంతెనగా ఏర్పడి కనిపిస్తున్న విభిన్న కాంక్రీటు బ్లాకుల మందం వంతెనపొడవునా ఒకే విధంగా లేదు. ఇక్కడ అటువంటి ఒక పల్చటి బ్లాకుని ఒంటి ఆధారంగల స్తంభం మోస్తోంది.చిత్రం-6 :ఈ భాగానికి చెందిన వంతెన ఉపరితలాన్ని ఒకే మట్టంలో కట్టాల్సి వుండగా, దానిస్తంభాలు మాత్రం ఒకటి పొట్టిగా ఇంకొకటి పొడవుగా ఉన్నాయి.
చిత్రం-7 :ఇక్కడా మళ్ళీ అటువంటి ఒక ఒంటి ఆధారం సిద్ధం. ఇది వంతెన బరువుని సమానంగాఅన్నివైపులకూ నిభాయించడం సందేహాస్పదం.

చిత్రం-8 :వంతెన మలుపులో మొగ్గిన విధానం తప్పు. ఉండాల్సిన దానికి పూర్తి విరుద్ధం.చిత్రంలోని పసుపుపచ్చ గీతలు ఉండాల్సిన వాలును సూచిస్తున్నాయి.కూలిపోయిన వంతెన భాగానికి ఈ భాగం ఆనుకునే ఉంది.(కూలిపోయిన భాగాన్ని నిర్మించకముందే ఈ ఫోటో తియ్యబడింది. ఇనుప స్తంభాల్నిగమనించండి)చిత్రం-9 :అదే వంతెన భాగం - మఱింత దగ్గరగా...
చిత్రం-10


చిత్రం-11 :సరిగ్గా రెణ్ణెల్ల క్రితంనాటి పరిస్థితి.

చిత్రం-12చిత్రం-13Saturday, September 15, 2007

ఆ భావమే లేదు....

చిన్నప్పటిలాంటి ఉత్సాహమే లేదు.... వినాయకచవితి వస్తోందంటే ఎంత ఉత్సాహంతో ఉరకలు వేసేవాళ్ళమో గుర్తుకొస్తే కళ్ళలో నీళ్ళూరడం తప్పితే మరేమీ లేదు!
తెల్లారీ తెల్లారకుండానే పత్రి కోసం తమ్ముడూ నేనూ సైకిళ్ళమీద పరుగో పరుగు.... ఎంత పత్రి అంటే, ఇందాక సాయంత్రం ఇరవై రూపాయలు పెట్టి కొన్నదానికి ఇరవై రెట్లెక్కువగా తెచ్చేవాళ్ళం.
ఈ భాగ్యనగరంలో పందిళ్ళకోసమే వినాయకుడు అన్నట్టుంటుంది. ఇంతబతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు (క్షమించాలి) నవరాత్రులూ అయ్యాక ఆయన్ని తీసుకెళ్ళి ఆ నికృష్ట సాగరంలో కలపడం, ఆ ఇనుప సామాను కోసం కొంతమంది దేవుకోడం, దుస్సహం, దురాగతమూను.
ఏదైమైనా ఈ నెలా రెండు నెలల్లో జరిగిన ఘోరకలుల వల్ల అస్సలు పండగ మూడే లేదు.............

సో సారీ........

Sunday, September 9, 2007

ఎటువైపీ పయనం.....

ఏం జరుగుతోందిక్కడ? సర్వంసహాసౌర్వభౌములవారి ఇంటికి కూతవేటు దూరంలోనే ఏమిటీ ఘోరం..
నేను, మీరు, మనందరం కొంటున్న ప్రతీ వస్తువూ, సబ్బు-ఉప్పు-పప్పు అన్నింటిమీదా వసూలుచేస్తున్న పైస పైస కూడబెట్టేది కొంతమంది అవినీతిపరుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారికి నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెల్లించడానికేనా!!

జరుగుతున్న ఘోరాలకి కారణ'భూతా'లెవరో కనుగొని వారి వారి ఆదాయంలోంచి సదరు నష్టపరిహారం (ఎక్స్‌గ్రేషియా) మొత్తాలను వసూలు చేయలేరా? నిజంగా ప్రభుత్వానికి ఆ శక్తి లేనట్లయితే ఇంత యంత్రాంగం, మంత్రాంగం నౌకర్లు చాకర్లు, ఇంత జీతాలు భత్యాల ఖర్చు మాత్రం మనమెందుకు భరించాలి? అసలు అవినీతికి పాల్పడుతున్నదే మేము, ఆ పని మేమెలా చేయగలమంటారేమో....

బాంబులు పేలితే బంగ్లాదేశ్‌లో మా యంత్రాంగం ఉందా అని ప్రశ్నించిన మాగొప్ప పాలకులు, మన సొంత బ్యురోక్రసీ, డెమొక్రసీ, కాంట్రాక్టోక్రసీ కలిసి కూల్చిన పదిహేను పైబడిన ప్రాణాల గూర్చి ఇంకెన్ని వల్లిస్తారో మరి రేప్పొద్దున్న చూడాలి........