చిన్నప్పటిలాంటి ఉత్సాహమే లేదు.... వినాయకచవితి వస్తోందంటే ఎంత ఉత్సాహంతో ఉరకలు వేసేవాళ్ళమో గుర్తుకొస్తే కళ్ళలో నీళ్ళూరడం తప్పితే మరేమీ లేదు!
తెల్లారీ తెల్లారకుండానే పత్రి కోసం తమ్ముడూ నేనూ సైకిళ్ళమీద పరుగో పరుగు.... ఎంత పత్రి అంటే, ఇందాక సాయంత్రం ఇరవై రూపాయలు పెట్టి కొన్నదానికి ఇరవై రెట్లెక్కువగా తెచ్చేవాళ్ళం.
ఈ భాగ్యనగరంలో పందిళ్ళకోసమే వినాయకుడు అన్నట్టుంటుంది. ఇంతబతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు (క్షమించాలి) నవరాత్రులూ అయ్యాక ఆయన్ని తీసుకెళ్ళి ఆ నికృష్ట సాగరంలో కలపడం, ఆ ఇనుప సామాను కోసం కొంతమంది దేవుకోడం, దుస్సహం, దురాగతమూను.
ఏదైమైనా ఈ నెలా రెండు నెలల్లో జరిగిన ఘోరకలుల వల్ల అస్సలు పండగ మూడే లేదు.............
సో సారీ........
Saturday, September 15, 2007
ఆ భావమే లేదు....
సంకలనం -
కందర్ప కృష్ణ మోహన్ -
సమయం
12:03 AM
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు
కృష్ణ మోహన్ గారు!
వినాయకచవితిపై ఇదే అభిప్రాయాల పరంపరలో నేను ఇంకొక చాలా మంచి జాబు Ganesh Chathurthi - Then and Now ! (ఆంగ్లములో ఉన్నది లేండి) చదివాను .. ఈ జాబులో కూడా చాలా చక్కగా వారి అభిప్రాయాలు వెల్లడించారు.
అందరి భావాలూ అవే కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. పూర్వపు రోజులులా ఒక రోజు వస్తుంది అని ఆశిద్దాము.
::::::::::
తెలుగు'వాడి'ని
Post a Comment